మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
       

 

Sri Skanda Shatkam – శ్రీ స్కంద షట్కం


షణ్ముఖం పార్వతీపుత్రం క్రౌంచశైలవిమర్దనమ్ |
దేవసేనాపతిం దేవం స్కందం వందే శివాత్మజమ్ || 1 ||

తారకాసురహంతారం మయూరాసనసంస్థితమ్ |
శక్తిపాణిం చ దేవేశం స్కందం వందే శివాత్మజమ్ || 2 ||

విశ్వేశ్వరప్రియం దేవం విశ్వేశ్వరతనూద్భవమ్ |
కాముకం కామదం కాంతం స్కందం వందే శివాత్మజమ్ || 3 ||

కుమారం మునిశార్దూలమానసానందగోచరమ్ |
వల్లీకాంతం జగద్యోనిం స్కందం వందే శివాత్మజమ్ || 4 ||

ప్రళయస్థితికర్తారం ఆదికర్తారమీశ్వరమ్ |
భక్తప్రియం మదోన్మత్తం స్కందం వందే శివాత్మజమ్ || 5 ||

విశాఖం సర్వభూతానాం స్వామినం కృత్తికాసుతమ్ |
సదాబలం జటాధారం స్కందం వందే శివాత్మజమ్ || 6 ||

స్కందషట్కం స్తోత్రమిదం యః పఠేచ్ఛృణుయాన్నరః |
వాంఛితాన్ లభతే సద్యశ్చాంతే స్కందపురం వ్రజేత్ || 7 ||

ఇతి శ్రీస్కందషట్కమ్ |

 


 

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.